హైదరాబాద్‌లో భారీ వర్లం, రోడ్లు జలమయం, సిటీ జనులకు అలర్ట్

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు, ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నాంపల్లి, హిమాయత్ నగర్​, ముషీరాబాద్​, విద్యానగర్, రామ్ నగర్, ఖైరతాబాద్‌, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా ఈదురు గాలులలో వాన కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడిపోయాయి. గాలుల ఉధృతి తీవ్రంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Heavy rain in Hyderabad alert for a few more hours

కుత్బుల్లాపూర్, దుండిగల్, సుచిత్ర, కొంపల్లి, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో మోస్తరు వర్షం పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలో ముందుగా ఈదురుగాలులు భయంకరమైన వాతావరణం సృష్టించాయి. తరువాత భారీ వర్షం కురిసింది. అమీర్‌​పేట్, పంజాగుట్ట, మధుర నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పరిసరాల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, కార్వాన్, ఎల్బీనగర్, వనస్థలిపురం, భాగ్యలతా, హయత్​‌నగర్​, పెద్ద అంబర్​పేట్, అబ్దుల్లాపూర్​మెట్​ ప్రాంతంలోనూ వర్షం పడుతోంది. ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

మరో మూడు గంటలపాటు హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో మరో మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలిపింది. బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైస్ చిలకలగూడ, చాదర్‌ఘాట్, ఆజంపురాలో ఈదురు గాలుల తీవ్రతకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు, కోకాపేటలో ఈదురుగాలుల బీభత్సానికి నిర్మాణ సామాగ్రి గాల్లో ఎగురుతూ కనిపించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+