హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తడిసిముద్దయిన హైదరాబాద్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన భారీవర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. శనివారం అర్థరాత్రి నుంచే విరామం లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి.

మోకాలిలోతు వర్షం నీరు నిలువటంతో నడవలేక పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం సెలవు కావటంతో వర్షం కారణంగా అధిక శాతం ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను పలు దఫాలుగా నిలిపివేశారు. శనివారం రాత్రి నుంచే ఓ మోస్తరుగా ప్రారంభమైన వర్షం ఆదివారం కూడా ఎడతెరపి లేకుండా కురిసింది.

ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ ,కోఠి, సుల్తాన్‌బజార్, ఖైరతాబాద్, సోమాజీగూడ, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాలలో భారీవర్షం కురిసింది. ప్రధాన రహదారులలో భారీగా వర్షం నీరు నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

లోతట్టు ప్రాంతాలు, మురికివాడల్లోకి భారీగా వర్షం నీరు రావడంతో నాలాలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు మూతలు ఎగిరిపోయాయి. జిహెచ్‌ఎంసి సహాయక సిబ్బంది ఆచూకీ కనిపించలేదు. దీంతో లోయర్‌ట్యాంక్ బండ్, ఇందిరాపార్కు, గాంధీనగర్, చిక్కడపల్లి, నాగమయ్యకుంట, బాపూజీనగర్ తదితర ప్రాంతాలలో మోకాలి లోతు చేరిన వర్షం, వరద నీటిలో నుంచి బయటపడేందుకు ప్రజలు అగచాట్లకు గురయ్యారు.

వర్షం

వర్షం

నగరంలో ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన భారీవర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.

వర్షం

వర్షం

శనివారం అర్థరాత్రి నుంచే విరామం లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది.

వర్షం

వర్షం

ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి.

వర్షం

వర్షం

మోకాలిలోతు వర్షం నీరు నిలువటంతో నడవలేక పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వర్షం

వర్షం

ఆదివారం సెలవు కావటంతో వర్షం కారణంగా అధిక శాతం ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.

వర్షం

వర్షం

వర్షంతో పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను పలు దఫాలుగా నిలిపివేశారు.

ఉప్పల్ క్రాస్ రోడ్

ఉప్పల్ క్రాస్ రోడ్

శనివారం రాత్రి నుంచే ఓ మోస్తరుగా ప్రారంభమైన వర్షం ఆదివారం కూడా ఎడతెరపి లేకుండా కురిసింది.

వర్షం

వర్షం

ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ ,కోఠి, సుల్తాన్‌బజార్, ఖైరతాబాద్, సోమాజీగూడ, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాలలో భారీవర్షం కురిసింది.

వర్షం

వర్షం

ప్రధాన రహదారులలో భారీగా వర్షం నీరు నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వర్షం

వర్షం

లోతట్టు ప్రాంతాలు, మురికివాడల్లోకి భారీగా వర్షం నీరు రావడంతో నాలాలు పొంగిపొర్లాయి.

వర్షం

వర్షం

డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు మూతలు ఎగిరిపోయాయి. జిహెచ్‌ఎంసి సహాయక సిబ్బంది ఆచూకీ కనిపించలేదు.

English summary
Heavy rainfall in Hyderabad city on saturday and Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X