హైదరాబాద్‌లో భారీ వర్షం: విద్యాలయాలకు సెలవు, హెచ్చరికలు, హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే

హైదరాబాద్: నగరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ప్రమత్తతో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నారు. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతాలు, నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

heavy rain in Hyderabad: holiday for educational institutions, alerts issued

హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో విద్యాలయాలకు మంగళవారం సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆయా జిల్లాల కలెక్టర్లు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

హెల్ప్ లైన్ నెంబర్లు

ఏదైనా సమస్య ఉంటే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.
040-21111111 or 9000113667 నెంబర్లను సంప్రదించాలని కోరారు. 100కి కూడా కాల్ చేయాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేని భారీ వర్షం

హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, నాంపల్లి, మలక్ పేట్, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్ , బేగంపేట్, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది.

సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కొనసాగుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. మరో రెండు మూడు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+