హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు జలమయం, భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ నగరం తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వరదనీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్​, తార్నాక, ఓయూ క్యాంపస్​, లాలాపేట్​ ప్రాంతాల్లో వర్షం పడింది. హయత్ నగర్, దిల్‌​సుఖ్‌నగర్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్​, ఉప్పల్​, రామంతాపూర్​, బోడుప్పల్​, పీర్జాదిగూడ, మేడిపల్లి, చిలుకానగర్​, కోఠి, అబిడ్స్​, బేగంబజార్​, నాంపల్లి, బషీర్‌​బాగ్​, లక్డీకాపూల్, పంజాగుట్ట​ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Heavy rain in Hyderabad Roads waterlogged heavy traffic jam

ముషీరాబాద్​, చిక్కడపల్లి, బాగ్‌​లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్​ రోడ్, అడిక్​మెట్​, రాంనగర్​, గాంధీనగర్​, జవహర్ ​నగర్​, కవాడీగూడ, దోమలగూడ, బోలకపూర్​, చంపాపేట్, సైదాబాద్​, సరూర్​ నగర్​, చైతన్యపురి, మలక్‌​పేట్​ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు.

కాగా, శుక్రవారం రాత్రి కూడా హైదరాబాద్​, సికింద్రాబాద్​ వ్యాప్తంగా భారీ వర్షం పడటంతో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, శనివారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా జోరు వాన పడింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో సుమారు అరగంట పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురియడంతో మురుగు కాలువలు నిండి పొంగిపొర్లాయి. ఉమ్మడి కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+