హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను వీడని వాన: రెండ్రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో మరో మూడు వారాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతి రోజూ.. రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా, గురువారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది.

భాగ్యనగరాన్ని వీడని వర్షాలు

భాగ్యనగరాన్ని వీడని వర్షాలు

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీ, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్‌పేట, లక్డికాపూల్‌, హిమాయత్​‌నగర్​, నారాయణ గూడ, లిబర్టీ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సైదాబాద్‌, శంషాబాద్, సాతంరాయి, గగన్‌పహాడ్, తొండుపల్లిలో వర్షం కురిసింది. మరోవైపు, యూసుఫ్‌​గూడా ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియటంతో.. రహదారులన్ని జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్​పూర్, బండ్లగూడ జాగిర్​, గండిపేట్, మణికొండ, పుప్పలగూడా, ఆరాంఘర్​ ప్రాంతాలలోనూ వర్షం కురిసింది.

ఉన్నట్టుండి భారీ వర్షం.. ప్రజలు బెంబేలు

ఉన్నట్టుండి భారీ వర్షం.. ప్రజలు బెంబేలు

భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు వాన నీటిలో మునిగిపోయాయి. మోకాళ్ల వరకు వరద వస్తుండటంతో.. స్థానికులతో పాటు వాహనాదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియక జనం తికమక పడుతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే వర్షంలో తడవకుండా రావడం కష్టంగానే మారింది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ​కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

రెండ్రోజులపాటు భారీ వర్షాలు.. మూడు వారాలపాటు జోరువానలు

రెండ్రోజులపాటు భారీ వర్షాలు.. మూడు వారాలపాటు జోరువానలు

ఇది ఇలావుండగా, మరో మూడు వారాలపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్ర, శనివారాల్లో 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆగస్టు 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

English summary
heavy rain lashes Hyderabad: next three weeks rains for telangana districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X