తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ నెల 29 నుంచి..!
తెలంగాణలో ఓవైపు చలి అధికం అవుతోంది. రాష్ట్రంలో చలి పులి మళ్లీ పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. సాయంత్రం 5- 6 గంటలు దాటితే చాలు రాష్ట్రం మొత్తం చలితో గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఉదయం 9 గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా చలి తీవ్రంగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ మరో పిడుగు లాంటి వార్త తెలిపింది. ఈ నెల 29 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈనెల 30 న కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
రాష్ట్రంలో ఇప్పటికే చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో సాయంత్రం అయితే ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలాగే ఉదయం 9 గంటలు అయినా కూడా చలి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అటు పల్లెలు, ఇటు పట్టణాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఐఎండీ షాక్ ఇచ్చింది.

నైరుతి బంగాళాఖాతం.. ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తుపాను.. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. తుపాను కారణంగా తెలంగాణలోని ఈ నెల 29, 30 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అయితే వర్షాలు కురిసినా చలి తీవ్రత మాత్రం తగ్గే అవకాశాలు లేవని తెలిపింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు భద్రాద్రి జిల్లా, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్.. జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చలి కారణంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications