Weather Alert: నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 5 వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై తీవ్రవాయుగుండం కదులుతుందని.. ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఇవాళ(గురువారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడే సమయంలో కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఏపీలో మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తూర్పుగోదావరి ఏలూరు, పోలవరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మార్కాపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తెలంగాణలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక్ అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణలో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(గురువారం) ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని.. గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటి గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.












Click it and Unblock the Notifications