రోడ్డుపై పెద్ద గొయ్యి: తప్పిన పెను ప్రమాదం, ఉధృతంగా ఎర్రగుంట నాలా!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు హైదరాబాద్ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతినడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

చాలాచోట్ల వరద నీరు డ్రైనేజీలోకి వెళ్లే మార్గం లేక రోడ్లపై నదులు ప్రవహిస్తున్నట్లే కనిపిస్తోంది. రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో వరద నీరు చేరి వాహనదారులకు అక్కడ గుంతలున్న సంగతి కూడా తెలియట్లేదు. దీంతో వాహనాలు ఆ గుంతల్లో కూరుకుపోతున్న పరిస్థితి.

ఎల్లమ్మబండ రోడ్డుపై గొయ్యి:

ఎల్లమ్మబండ రోడ్డుపై గొయ్యి:

ఆల్విన్‌కాలనీ నుండి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో.. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. రోడ్డు కింద వేసిన మంచినీటి పైపులైన్ పగలడంతో గొయ్యి ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

 ప్రమాదం తప్పింది:

ప్రమాదం తప్పింది:

నిత్యం రద్దీగా ఉండే అల్విన్ కాలనీ రోడ్డులో.. తెల్లవారుఝామున సంఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో రోడ్డు మీద జనసంచారం లేదు.

అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే రోడ్డు మరింత కుంగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చుక్కలు కనిపించాయి: వర్షం ధాటికి రోడ్లపై నరకయాతన, మరో నాలుగు రోజులు!

సమీక్షించిన ఎమ్మెల్యే గాంధీ:

సమీక్షించిన ఎమ్మెల్యే గాంధీ:

ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని పైపులైన్ రోడ్డు గోవింద్ హోటల్ చౌరస్తాలో గుంత ఏర్పడిన విషయాన్ని తెలుసుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టామని పేర్కొన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి యథాస్థితికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

 ఎర్రగుంట నాలాలో పడ్డ వ్యక్తి:

ఎర్రగుంట నాలాలో పడ్డ వ్యక్తి:

నాచారం ఎర్రగుంట నాలాలో బాబానగర్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. బైక్ పై వస్తూ ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయాడు. అయితే స్థానికులు తక్షణమే స్పందించి అతన్ని రక్షించారు. లాలాగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 నీటమునిగిన కాలనీలు :

నీటమునిగిన కాలనీలు :

సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఎర్రగుంట నాలా పొంగి పొర్లుతోంది. దీంతో రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాలాపేట్‌లో పలు కాలనీలు నీటమునిగాయి. నాచారం-హబ్సిగూడల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy rains damage roads in Hyderabad. Heavy rains that lashed the city over the past two to three days

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి