తెలంగాణకు భారీ వర్ష సూచన: రానున్న 48 గంటల్లో విస్తారంగా వర్షాలు

హైదరాబాదు: తెలంగాణలోని చాలా జిల్లాల్లో నైరుతీ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఈ రుతుపవనాలు ఇతర జిల్లాల్లో కూడా మరింత వేగంగా విస్తరిస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. గురువారం రోజున రికార్డు చేసిన వర్షపాతం ప్రకారం గత 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్‌లో అత్యధికంగా 14 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. ఆ తర్వాత గర్లాలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ, యాదగిరిగుట్టలో వరుసగా 12 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక జూన్ 11 నుంచి 12వ తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ 12 నుంచి 13 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక 14వ తేదీన కూడా ఈ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Heavy Rains expected within next 48 hours in Telangana

ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటమే అని వివరించారు. తూర్పు మధ్య బంగాళా ఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వెదర్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. ఇక పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడి ఆంధ్రప్రదేశ్‌ వైపు కదులుతోందని అక్కడ కూడా జూన్ 13 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+