నిన్న విజయవాడ, నేడు హైదరాబాద్: భారీ వర్షం, ఒక్కసారిగా మారిన వాతావరణం(వీడియో)
Recommended Video

హైదరాబాద్ లో భారీ వర్షాలు
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత కురిసింది. మధ్యాహ్నం అప్పటి దాకా ఎండ కనిపించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటిన తర్వాత హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. హైదరాబాదులో ఒకింత చీకట్లు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది.
Heavy Rains In Hyderabad.. #hyderabadrains pic.twitter.com/QTcpu4ADbH
— Oneindia Telugu (@oneindiatelugu) May 3, 2018
రెండు రోజుల క్రితం విశాఖపట్నం, అమరావతిలోను ఇలాగే ఒక్కసారిగా వాతావరణం మారిన విషయం తెలిసిందే. విశాఖలో సముద్రం ఎరుపెక్కగా, అమరావతి, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో హఠాత్తుగా సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మని చీకట్లు కమ్ముకున్నాయి. హైదరాబాదులోని ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే కనిపించింది.













Click it and Unblock the Notifications