Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణకు భారీగా వరద.. ఈ రెండు తేదీల్లో అతి భారీ వర్షాలు..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26,27 తేదీల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణలోని ప్రధాన జలాశయాలన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల సహా పలు ప్రాజెక్టుల్లో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటి మట్టం 1086.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 321 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తోంది.

Heavy Rains in Guwahati and Telangana Cause Flooding Reservoirs Fill Up

ఇక రాష్ట్రంలో ఈ నెల 26,27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు గంటల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌, భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 25న ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+