హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం, ఇవాళ, రేపు కూడా.. హైదరాబాద్‌లో ఎల్లో వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

ఉపరితల ఆవర్తనంతో బుధవారం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. పల్లె, పట్టణం, నగరాల్లో జోరువాన కురిసింది. గురు, శుక్రవారాల్లో కూడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కురిసిన వర్షంతో భాగ్యనగర వీధులు వర్షపునీటితో నిండిపోయాయి. ఒకటి, రెండు చోట్ల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా ఎల్లో వార్నింగ్ జారీచేశారు. ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

జాగ్రత్త: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షంజాగ్రత్త: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షం

వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు రాగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బాలానగర్‌లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్లు, అత్యల్పంగా మూసాపేట సర్కిల్‌ పరిధిలోని అల్లాపూర్‌లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

heavy rains in telangana state, yellow warning issue in hyderabad

Recommended Video

#MumbaiRains: Red Alert, Heavy Rainfall చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని ముంబై...!! | Oneindia Telugu

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని మల్లన్నవాగు, కిన్నెరసాని, నడివాగు, దున్నపోతులవాగు, ఏడుమెలికల వాగు, ఆళ్లపల్లి మండలంలో జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌ రూరల్‌లోని ఖానాపూర్‌లో 11 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 12, ములుగు జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్లు, వరంగల్‌రూరల్‌లోని నర్సంపేటలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఆలమట్టి, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద ఉండటంతో ఆలమట్టి ప్రాజెక్టు కొన్నిగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

English summary
heavy rains in telangana state in wednesday, today tomorrow also heavy rains weather officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X