హైదరాబాద్‌లో వర్షం బీభత్సం!: నీట మునిగిన వాహనాలు (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆదివారం హఠాత్తుగా భారీ వర్షం ముంచెత్తింది. పలుచోట్ల కుండపోత కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. నేడు, రేపు కూడా భారీగా వర్ష సూచన ఉంది.

ఆదివారం పలు ప్రాంతాల్లో హఠాత్తుగా కురిసిన భారీ వర్షం రైతులను ఊరడించగా, ప్రజలను బెంబేలెత్తించింది. హైదరాబాదులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు గంటపాటు భారీ వర్షం కురిసింది.

నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం కురిసిన వానతో రహదారులు, వీధులను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటి ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలను ఏర్పాటు చేశారు.

భారీ వర్షం

భారీ వర్షం

భాగ్యనగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి సగం నగరం వణికిపోయింది. రహదారులన్నీ వరదకాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షం

భారీ వర్షం

ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారి పక్కనున్న కొన్ని కాలనీల్లోకి వాననీరు పోటెత్తింది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షం

భారీ వర్షం

కొన్నిచోట్ల జల్లులు, మరికొన్నిచోట్ల భారీ వర్షం పడటానికి క్యుమలోనింబస్‌ మేఘాలే కారణమని చెబుతున్నారు. వర్షానికి విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.

భారీ వర్షం

భారీ వర్షం

పలు చౌరస్తాలలో మోకాళ్లలోతు నీరు రహదారిపై నిల్చిపోవడంతో దారి మూసుకుపోయింది. కొత్తపేట నుంచి ఎల్బీ నగర్‌ మార్గంలోనూ పలు ప్రాంతాల్లో వరదనీరు ఎక్కడికక్కడే నిల్చి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

భారీ వర్షం

భారీ వర్షం

పాత మలక్‌పేటలో పాత ఇల్లు ప్రహరీ కూలింది. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల ఘటనా స్థలిని పరిశీలించారు. చాదర్‌ఘాట్‌ ముసానగర్‌, చంపాపేట రెడ్డికాలనీ, సింగరేణి కాలనీ, సరస్వతీనగర్‌, బాలాజీనగర్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది.

భారీ వర్షం

భారీ వర్షం

గ్రేటర్‌లో ఆదివారం మధ్యాహ్న సమయంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.

భారీ వర్షం

భారీ వర్షం

భారీ వర్షం కారణంగా విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, వనస్థలిపురం, ఆర్టీసీ క్రాస్‌రోడ్, విద్యానగర్, చంపాపేట, మీర్‌పేట ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది.

భారీ వర్షం

భారీ వర్షం

చంపాపేట రెడ్డి కాలనీలో వరద తాకిడికి ఓ కారు కొట్టుకుపోయింది. స్థానికుల ప్రమేయంతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

భారీ వర్షం

భారీ వర్షం

లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి, సెలర్లకు నీరు భారీగా చేరింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో ఆదివారం గరిష్టం 35.5, కనిష్టం 23.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్నాయి.

 భారీ వర్షం

భారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి కారణంగా ఆదివారం హైదరాబాద్ నగరం చల్లబడింది. ఎండ వేడిమి నుండి కొంత ఉపశమనం కలిగింది.

భారీ వర్షం

భారీ వర్షం

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భారీ వర్షం

భారీ వర్షం

విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమై వాహనాలు నీటి ప్రవాహంలో కదలక మధ్యలోనే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

భారీ వర్షం

భారీ వర్షం

దీంతో వాహనాచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చంపాపేట్ రెడ్డికాలనీలో వర్షం నీటి ప్రవాహంలో కారు చిక్కుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిని స్థానికులు అప్రమత్తమై ట్రాక్టర్ సహాయంతో రక్షించారు.

భారీ వర్షం

భారీ వర్షం

రామానాయుడు సినీ స్టూడియో సమీపంలో వర్షం ఉద్ధృతి తాకిడికి మురికి నీటి కాలువకు గండిపడి నీరంతా దిగువ ఉన్న లోతట్టు ప్రాంతంలోకి చేరుకోవడంతో జనజీవనం స్థంభించింది.

భారీ వర్షం

భారీ వర్షం

వర్షం కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాలను బయటకు తీయడానికి వాహనాదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పడిన కష్టాలు వర్ణనాతీతం.

భారీ వర్షం

భారీ వర్షం

ఆదివారం సెలవుదినం కావడం, ఎక్కువ వాహనాలు రోడ్లపై కన్పించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులకు పెద్ద భారం తప్పింది.

భారీ వర్షం

భారీ వర్షం

హైదరాబాద్ నగరంలో భారీవర్షం కురిసి జన జీవనం అతలాకుతలం అయినప్పటికీ శివారు ప్రాంతాల్లో చిరుజల్లులతో చల్లని వాతావరణం ఏర్పడి ఉపశమనం కలిగింది.

భారీ వర్షం

భారీ వర్షం

వర్షాకాలంలో ఎండలు తీవ్రమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వరుణుడు కరుణించి చిరు జల్లులు కురిపించడంతో నగర ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

భారీ వర్షం

భారీ వర్షం

అల్పపీడ ద్రోణి ప్రభావం రానున్న 24గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

భారీ వర్షం

భారీ వర్షం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆదివారం హఠాత్తుగా భారీ వర్షం ముంచెత్తింది. పలుచోట్ల కుండపోత కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. నేడు, రేపు కూడా భారీగా వర్ష సూచన ఉంది.

 భారీ వర్షం

భారీ వర్షం

ఆదివారం పలు ప్రాంతాల్లో హఠాత్తుగా కురిసిన భారీ వర్షం రైతులను ఊరడించగా, ప్రజలను బెంబేలెత్తించింది. హైదరాబాదులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు గంటపాటు భారీ వర్షం కురిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+