దంచికొడుతున్న వాన.. రంగారెడ్డిలో రికార్డు స్థాయి వర్షం
రంగారెడ్డి : దంచికొడుతున్న వర్షాలతో తెలంగాణ చివరుటాకులా వణికిపోతుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కాగా, రంగారెడ్డి జిల్లా థారూర్ లో బుధవారం ఒక్క రోజే 109.5 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదవడం గమనార్హం.దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశముండడంతో.. తెలంగాణను మరిన్ని వర్షాలు ముంచెత్తనున్నాయి.












Click it and Unblock the Notifications