హైదరాబాద్ లో భారీగా వరదలు.. ఆరెంజ్ అలెర్ట్.. ఫోన్ లు, లైట్లు ఛార్జింగ్ పెట్టుకోండి..

హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం కురిసిన భారీ వ‌ర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. ఈ రాత్రికి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షానికి ఐటీ ఏరియా, కొండాపూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌ లో భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. ఈ మేరకు రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాలకు సికింద్రాబాద్‌ లోని 'పైగా'కాలనీ నీట మునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి భారీ చేరిన వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా కొన్ని పరిశ్రమలు, షోరూమ్స్‌ ఉద్యోగులు వరద నీరులో చిక్కుకున్నారు. అలా చిక్కుకున్న వారందరినీ బోట్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు హైడ్రా అధికారులు.

మరోవైపు భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. GHMC, HMDA, వాటర్‌ వర్క్స్‌ సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యుత్‌, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. SDRF, NDRF, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Heavy Rains Trigger Severe Flooding in Hyderabad Orange Alert Issued

మరోవైపు భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ పర్యటిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతలోని పైగా కాలనీ నీట మునిగింది. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమ‌ర్జన్సీ టీమ్‌ లు కూడా రంగంలో దిగి స‌హాయ‌క చ‌ర్యలను ముమ్మరం చేశాయి. మాసబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్‌ పల్లి, హాఫిజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+