జగన్ కూడా ఉన్నారు: వైయస్ రాజశేఖర రెడ్డిపై మహేష్ బాబు ప్రశంసలు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అద్భుతమైన వ్యక్తి అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. స్పైడర్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు.
Recommended Video

హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అద్భుతమైన వ్యక్తి అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. స్పైడర్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు.
చదవండి: చిరంజీవి దారిలో మహేష్ బాబు నో

వైయస్ అద్భుతమైన వ్యక్తి
ఈ సందర్భంగా మహేష్ బాబు ఓ సందర్భంలో వైయస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు. రాజకీయాలను పక్కన పెడితే, గతంలో తాను కూడా ఆయనను కలిశానని చెప్పారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.

నా తండ్రికి క్లోజ్, జగన్ ఉన్నారు
తన తండ్రి, నటుడు కృష్ణకు వైయస్ రాజశేఖర రెడ్డి చాలా క్లోజ్ అని మహేష్ బాబు చెప్పారు. తాను వైయస్‌ను కలిసినప్పుడు అప్పుడు ప్రస్తుత వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారని గుర్తు చేశారు.

నాకు అది మాత్రమే తెలుసు
తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని మహేష్ బాబు చెప్పారు. అందులోకి రానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దూకుడు సినిమాలో రాజకీయ నాయకుడిగా నటించడంపై మాట్లాడుతూ.. నటించడం వరకే తనకు తెలుసునని చెప్పారు.

రాజకీయాలపై క్లారిటీ
కాగా, స్పైడర్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను రాజకీయ అంశాల పైన కూడా ప్రశ్నిస్తోంది. కానీ తాను రాజకీయాలకు దూరమని ఆయన చెబుతున్నారు.












Click it and Unblock the Notifications