వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్రాస్ గ్యాంగ్ రేప్... మారుదాం బాస్ ప్లీజ్... మంచు మనోజ్ ట్వీట్...

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ పట్ల సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న తరుణంలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా ట్విట్టర్‌లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హత్రాస్ ఘటన గురించి ఆయన ప్రస్తావించనప్పటికీ... మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలను తీవ్రంగా నిరసించారు.

'ఆడది అర్ధరాత్రి నిర్భయంగా బయట తిరగగలిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని బాపు చెప్పారు. కానీ పట్టపగలే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఏడాదికోసారి గాంధీ జయంతి సెలవిచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడంలో అర్థమేముంది... మనకి బాపు కరెన్సీ మీద ఒక డిజైన్,ప్రతీ ఏడాది ఒకరోజు సెలవిచ్చే వారం... ఆ రోజు మందు దొరకకుండా చేసే ఒక శాపం... అంతేగా... మారుదాం బాస్... ప్లీజ్..' అని మంచు మనోజ్ తన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

hero manchu manoj tweet against rape incidents in india

ఇటీవల హత్రాస్‌లో నలుగురు అగ్రవర్ణాలకు చెందిన యువకులు ఆ యువతిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడటం... పోలీసులు రాత్రికే రాత్రే రహస్యంగా దహన సంస్కారాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మొత్తంగా ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని విపక్షాలు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నటుడు మంచు మనోజ్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు.

Recommended Video

Actor Navdeep Strong Counter To Netizen | Oneindia Telugu

English summary
Tollywood hero Manchu Manoj reacted on rape incidents in india,he reminded Gandhiji famous quote of The day a woman can walk freely on the roads at night, that day we can say that India has achieved independence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X