అద్దాలు ధ్వంసం, బీభత్సం: పబ్‌పై దాడి చేసిన హీరో ఉదయ్ కిరణ్ అరెస్ట్
హైదరాబాద్: తనను పబ్‌లోకి రానివ్వలేదని అద్దాలు ధ్వంసం చేసి, సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బీభత్సం సృష్టించిన 'ఫ్రెండ్స్‌బుక్' సినిమా హీరోను జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రెండుసార్లు డ్రగ్స్ కేసుల్లో, ఒక యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పట్టుబడ్డ ఈ హీరో తాజాగా బుధవారం రాత్రి ఓ పబ్‌పై దాడి చేశాడు.
పోలీసులు కథనం ప్రకారం మాదాపూర్‌లో ఉండే నండూరి ఉదయ్‌కిరణ్ అలియాస్ బాబీ (ఫ్రెండ్స్‌బుక్, పరారే చిత్రాల్లో నటించారు) బుధవారం రాత్రి 11.30కి జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఉన్న ఓవర్ ద మూన్ పబ్‌కు వెళ్లాడు. గతంలో పబ్‌కు వచ్చిగొడవ చేసినట్లు గుర్తించిన నిర్వాహకులు ఇతడిని లోపలికి అనుమతించలేదు.
దీంతో అతను 'నేను హీరోని, నన్నే అనుమతించరా?.. అంటూ సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ పబ్ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అక్కడున్న తలుపు అద్దాలు ధ్వంసం చేసి లోనికి తీసుకెళ్లి మద్యం సీసాలు పగులగొట్టి, కుర్చీలు ఎత్తేశాడు.

దీంతో పబ్‌లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగుతీశారు. పబ్ సిబ్బంది ఫిర్యాదుతో జూబ్లిహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అతడి నివాసంలో నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులో మరో కథానాయకుడి సోదరుడు, నైజీరియన్లతో కలిసి పట్టుబడ్డాడు. తాజాగా మూడు నెలల క్రితం కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు ఉదయ్‌కిరణ్‌పై రౌడీషీట్ తెరిచారు.
అంతేకాకుండా పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఓ బార్బర్ షాపులో దాడి ఘటనలో ఇతనిపై కేసు నమోదైంది. సీసీఎస్‌లో కూడా ఇతనిపై మరో కేసు ఉంది. వీటికి తోడు ఇటీవల మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిగా ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
పోలీస్ స్టేషన్‌లోనూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని న్సూసెన్స్ కేసు, పబ్‌పై దాడికి పాల్పడినందుకు మరో కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications