లవర్‌తో ఓయో రూమ్‌కి వెళ్తున్నారా...? మీరు డేంజర్‌లో పడినట్లే..!

గతంలో ప్రేమికులు పార్క్‌లను తమ అడ్డగా మార్చుకునేవారు. కానీ కాలక్రమేణ లవర్స్ ఏకాంతంగా గడపటానికి ఎక్కువగా ఓయో రూమ్స్‌ను తమకు బెస్ట్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఓయో రూమ్స్ లవర్స్‌గా అడ్డగా మారిపోయిందనే చెప్పాలి. ఓయో రూమ్స్ పట్ల సమాజంలో ఏ రకమైన భావన ఉందో అందరికీ తెలిసిందే. నార్మల్ ఫ్యామిలీస్ ఓయో రూమ్‌ అంటేనే అసహ్యించుకునే రోజులు వచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఓయో రూమ్స్ అడ్డాగా మారాయి. ఈ హోటల్స్‌పై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాతే రూం ఇవ్వడం జరుగుతోంది.

అయితే ఫుల్ సెఫ్టీ అని భావిస్తోన్న ఓయో కస్టమర్లకు ఓ హోటల్ నిర్వాహకుడు బిగ్ షాకిచ్చాడు.ఓయో రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టి, కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బు గుంజుతున్నాడు. ఓ జంట ఫిర్యాదు చేయడంతో హోటల్ యజమాని బండారం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్‌లో సితా గ్రాండ్ పేరుతో ఓయో సంస్థతో కలిసి గదులు అద్దెకు ఇచ్చే హోటల్ నడుపుతున్నారు. అయితే ఎవరికి తెలియకుండా గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. తన హోటల్‌కు వచ్చిన జంటలు ఏకాంతంగా గడిపిన వీడియోలను రికార్డు చేసి, వారిని బెదిరించడం మొదలుపెట్టాడు.

Hidden Camera in hyderabad Oyo Room

ఎంతో కొంత డబ్బు ముట్టచెబితే వీడియో డిలీట్ చేస్తానని, లేకపోతే సామాజిక మాద్యమాల్లో పెడతానని చెప్పి డబ్బు గుంజేవాడు. ఇలాగే ఓ జంటను కూడా బెదిరించే ప్రయత్నం చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హోటల్ నిర్వాహుకుడి బండారం బట్టబయలు అయ్యింది. ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతని నుంచి రెండు ఫోన్లు, సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. ఓయో రూం పేరుతో హోటల్ నడుపుతూ.. ఇలా చాలాకాలంగా తన హోటల్‌కు వచ్చిన జంటలను బెదిరింపులకు గురి చేసి, డబ్బు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+