వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటుంది.!కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి కామెంట్.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అధిక వర్షాలు వరదలుగా మారిందని, ప్రకృతి వైపరీత్యం బీభత్సం సృష్టించిందని, ఈ పరిస్థితిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీపిసిసి అద్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. కానీ సీఎం చంద్రశేఖర్ రావు రాజకీయ కారణాలతో, స్వార్ధం కోసం ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 వరదల వల్ల తీవ్ర నష్టం.. ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం చెందారన్న రేవంత్ రెడ్డి..

వరదల వల్ల తీవ్ర నష్టం.. ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం చెందారన్న రేవంత్ రెడ్డి..

అంతే కాకుండా వరదల వల్ల రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తమకు సమాచారం ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం 14వందల కోట్ల నష్టం అంటూ నివేదిక సమర్పించిందన్నారు రేవంత్ రెడ్డి. 40 మంది వరదలతో చనిపోయారని, వారి కుటుంబాలు అనాధలు అయ్యారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వచ్చి మూడు రోజులు అయ్యిందని, ప్రదానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తారు అనుకున్నాం కానీ ఆ విధమైన కార్యక్రమాలు ఏవీ జరగకపోవడం శోచనీయమన్నారు రేవంత్ రెడ్డి.

 సీఎం ఢిల్లీలో మకాం.. కానీ ఉంటుంది రికాం.. సెటైర్ వేసిన పీసిసి ఛీఫ్..

సీఎం ఢిల్లీలో మకాం.. కానీ ఉంటుంది రికాం.. సెటైర్ వేసిన పీసిసి ఛీఫ్..


ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీలో సొంత పార్టీ ఎంపిలకే టైమ్ ఇవ్వటం లేదని, ఢిల్లీలో మూడు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ప్రధానితో పాటూ, కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి ఇప్పటికి అపాయింట్మెంట్ అడగలేదని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రానికే పీఎం కాదని గుర్తుంచుకోవాలని రేవంత్ మండిపడ్డారు. గుజరాత్ లో వరదలు వస్తే ఆఘమేఘాల మీద వేల కోట్లు మంజూరు చేస్తారు గానీ, తెలంగాణలో వరదలు సంభవిస్తే కేంద్రం ఎందుకు పట్టించుకోదని రేవంత్ రెడ్డి నిలదీసారు.

 వరదల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం.. ప్రధాని ఎందుకు స్పందించడం లేదన్న రేవంత్

వరదల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం.. ప్రధాని ఎందుకు స్పందించడం లేదన్న రేవంత్


కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు ఇళ్లు వదలడం లేదని, ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు భయపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు మిగతా పక్షాల వెనుక దాక్కుని పోరాటం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు రేవంత్ రెడ్డి. ఎంపిలు ఫోటోలకు ఫోజులిస్తున్నారని, ప్రధాని మోడీ, సీఎం చంద్రశేఖర్ రావులు తెలంగాణను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు.

 మోదీని ప్రశ్నించడానికి ఏంటి సమస్య.. రాష్ట్ర ప్రయెజనాలకోసం పనిచేయాలన్న రేవంత్

మోదీని ప్రశ్నించడానికి ఏంటి సమస్య.. రాష్ట్ర ప్రయెజనాలకోసం పనిచేయాలన్న రేవంత్

రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దాం అంటే తమకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదనన్నారు రేవంత్ రెడ్డి. ప్రదానిపై సీఎం చంద్రశేఖర్ రావు పోరాట కార్యాచరణను ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. అంతవరకూ ఢిల్లీ నుంచి కదలొద్దన్నారు. లేదంటే మీ అవినీతిని ప్రశ్నిస్తారనే ప్రధానిపై మాట్లాడటం లేదని తెలంగాణ సమాజం భావించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హితవు పలికారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటుందనన్నారు పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి.

English summary
PCC Chief Revant Reddy said that the issue of MLA Komati Reddy Raj Gopal Reddy will be discussed within the party. Revanth said that the high command will take a key decision on this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X