రేవంత్ భద్రతపై ఏం చేశారు?: ఈసీ, కేంద్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తనకు కేంద్ర సిబ్బందితో భద్రత కల్పించాలన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది. ఈ విషయంపై వివరాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కేంద్ర సిబ్బంది లేదా స్వతంత్ర సంస్థతో తనకు భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రేవంత్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో ప్రమాదం పొంచివున్నందున నలుగురు సిబ్బందితో భద్రత కల్పించాలని కోరారు.

High Court asks EC and Centre on Revanth Reddys security details

ఈసీకి, కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసినప్పటికీ స్పందన రాలేదని రేవంత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని ఈసీ, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తమకు ఆ వివరాలు అందించాలని ఈసీ, కేంద్రం తరపు న్యాయవాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారాని(అక్టోబర్ 26)కి వాయిదా వేసింది హైకోర్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+