హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రగతి నివేదన సభ: హైకోర్టులో టీఆర్ఎస్ సర్కారుకు ఊరట, సభకు లైన్‌క్లియర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రగతి నివేదన సభ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 2న నిర్వహిస్తోన్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది పూజారి శ్రీధర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

High Court dismisses PIL against Pragati Nivedana Sabha

ఇలా సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటిషన్‌ ద్వారా కోరారు. పిటిషన్‌పై మరోసారి విచారించిన హైకోర్టు ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ అడ్వోకేట్‌ జనరల్‌, న్యాయమూర్తికి తెలిపారు.

Recommended Video

తెలంగాణ కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం....!

ప్రభుత్వ అడ్వోకేట్‌ జనరల్‌ సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరుపుకోవాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వ అడ్వోకేట్‌ జనరల్‌ హామీ ఇ‍వ్వడంతో హైకోర్టు, పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రగతి నివేదన సభకు లైన్ క్లియర్ అయ్యింది.

English summary
The High Court on Friday dismissed a Public Interest Litigation (PIL) petition filed by the Nadigadda Paryavarana Parirakshna Samiti president, P Sridhar challenging the permission given for the Pragati Nivedika Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X