ఎమ్మెల్యేల అనర్హత పై హైకోర్టు కీలక నిర్ణయం - బిగ్ టర్న్..!!
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత విషయంలో నాలుగు వారాల్లోగా షెడ్యూల్ విడుదల చేయాలని 20 రోజుల క్రితం హైకోర్టు సింగ్ బెంచ్ ఆదేశించింది. ఈ ఆదేశాల పైన అసెంబ్లీ కార్యదర్శి స్టే కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలకు విముఖత వ్యక్తం చేసిది.
ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే అంశం పై హైకోర్టు తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటీషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ పైన షెడ్యూల్ విడుదల చేయాలని..ఈ సమాచారం ఇస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీ మారిన వారి పైన వచ్చిన ఫిర్యాదుల గురించి ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేసారు. కాగా, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల పై అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఆదేశాల పన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని..ఈ నెల 24న వాదనలు వింటామని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications