హెచ్‌సీఏపై హైకోర్టు సంచలనం: అధ్యక్షుడు, సెక్రటరీ సస్పెన్షన్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్ సీఏ)పై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ సీఏ బ్యాంకు ఖాతాలన్ని వెంటనే సీజ్‌ చేయాలని ఆదేశించింది. అధ్యక్షుడు అర్షద్‌ ఆయూబ్‌, కార్యదర్శి మనోజ్‌, జాయింట్‌ సెక్రటరీ పురుషోత్తం అగర్వాల్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది.

లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలుచేయకపోవడంపై అడహక్ కమిటీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిటీ సిఫారసుల ప్రకారం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే పాత కమిటీని కూడా రద్దు చేసి వెంటనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ, అలాంటి చర్యలేవీ కూడా ఇప్పటి వరకు హెచ్‌ సీఏ తీసుకోలేదు.

High Court of Hyderabad

గత ఐదేరాళ్లుగా హెచ్‌సీఏకు పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నట్లు సమాచారం. ఏటా దాదాపు 31కోట్లు వస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ నిధులను జిల్లాలో స్టేడియాల పేరిట దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎక్కడా ఒక్క స్టేడియాన్ని, ఇతర మౌలిక వసతులు ఏర్పాటుచేసినట్లు కనిపించని నేపథ్యంలో మరిన్ని నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే హైకోర్టు ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏలో 500 కోట్లు మేర అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court of Hyderabad Cricket Association.
Please Wait while comments are loading...