BRS: బీఆర్ఎస్ కు షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ వదిలి వెళ్లిపోయారు. కాంగ్రెస్, బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వీరిద్దరి ఎన్నకకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ హైకోర్టుకు వెళ్లారు. మల్లారెడ్డి సూరారంలో గ్రామంలో భూమి ఉందని తెలిపారు. అయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని వజ్రేష్ యాదవు చెబుతున్నారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా తన అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాలు వెల్లడించలేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మరో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు. అలాగే ఓయూ విద్యార్థి నాగేందర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వసతి గృహాల మెస్‌ల మూసివేతపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు సర్క్యులర్ ఇస్తారు. ఈ సంవత్సరం కూడా అధికారులు సర్క్యూలర్ జారీ చేశారు. అయితే దీనిపై దుష్ప్రచారం చేయడంతో క్రిశాంక్ పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications