కేటీఆర్ విచారణ వేళ హైకోర్టు కీలక ఆదేశాలు..!!
కేటీఆర్ కేసులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను హై కోర్టు తిరస్కరించటంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఎప్పుడు విచారణ ఉంటుందనేది ఇంకా స్పష్టత లేదు. ఇటు తన విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఆదేశించా లంటూ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రేపు (గురువారం) కేటీఆర్ విచారణ కోసం ఏసీబీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. దీంతో, రేపటి పరిణామాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.
హైకోర్టులో విచారణ
ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన న్యాయస్థాన్ని ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది. కేటీఆర్ తో పాటుగా న్యాయవాది కూర్చోటానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ఏసీబీ ఆఫీసు లో దూరంగా న్యాయవాది ఉండటానికి అనుమతిస్తామని పేర్కొంది. ఇందు కోసం ముగ్గురు లాయర్ల పేర్లను సూచించాలని నిర్దేశించింది. ఆ తరువాత తాము ఈ పిటీషన్ పైన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. దీంతో, ఇప్పుడు కేటీఆర్ ముగ్గురు న్యాయవాదుల పేర్లు సూచించాల్సి ఉంది.

కోర్టు సూచనలు
ఇక, హైకోర్టులో క్వాష్ పిటీషన్ తిరస్కరించటంతో కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ కేసు విచారణ ఎప్పుడు జరిగేదీ ఇంకా స్పష్టత రాలేదు. వరుస సెలవులు కావటంతో కేసు విచారణ బెంచ్ మీదకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు, రేపు (గురువారం) కేటీఆర్ విచారణ కోసం ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసు విచారణ కోసం ఈ రోజు ఇద్దరు అధికారులు హాజరయ్యారు. వారి నుంచి సమాచారం సేకరిస్తున్న ఏసీబీ.. నాడు మంత్రిగా కేటీఆర్ పాత్ర గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారిచ్చే సమాచారం ఆధారంగా కేటీఆర్ విచారణకు అధికారులు సిద్దం అవుతున్నారు.
రేపే విచారణ
విచారణకు రేపు హాజరయ్యేందుకు అటు కేటీఆర్ సైతం సమాయత్తం అవుతున్నారు. కోర్టు సూచించిన విధంగా న్యాయవాది విషయంలో వ్యవహరిస్తూ విచారణకు సహకరించేందుకు కేటీఆర్ సిద్దంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, కేటీఆర్ కోరుకున్న విధంగా తనతో కూర్చోవటానికి న్యాయవాదికి కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఇటు ఏసీబీ అధికారులు ఫార్ములా-ఈ కార్ రేసు కేసు విచారణలో వేగం పెంచారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఈ కేసులో 45కోట్ల 71 లక్షలు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో రేపు కేటీఆర్ విచారణ .. తదనంతర పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications