రాజా సింగ్‌పై పీడీ యాక్టు: తెలంగాణ సర్కారుకు, సీపీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీ యాక్టు అమలు చేయడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శికి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారంటూ రాజా సింగ్ భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, మిగితా రెండు పాత కేసుల్లో నోటీసులకు సమయం కూడా ఇవ్వలేదని ఉషాబాయి పిటిషన్ లో పేర్కొన్నారు.

High Court notices to Telangana govt due to PD Act filed on Raja singh

సుప్రీంకోర్టు, హైకోర్టు జారీ చేసిన సూత్రాలు, మార్గదర్శకాలను పాటించలేదని ఉష బాయి వాదించారు. తన భర్తను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకోవడానికి సిఫారసు చేసిన సంబంధిత పత్రాలు హిందీలో లేవని పేర్కొన్నారు. నిర్బంధానికి గురైన వ్యక్తి మాతృభాషలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను ప్రచురించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు గుర్తు చేస్తోన్నాయని అన్నారు. అడ్వైజరీ కమిటీ ముందు లిఖితపూరక సమాధానం ఇవ్వడానికి హైదరాబాద్ పోలీసులు తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

తన భర్త రాజా సింగ్‌ను గూండాగా పోలీసులు అభివర్ణించడం పట్ల ఉష బాయి అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో ప్రమాదకరమైన కార్యకలాపాలకు పాల్పడకుండా అనే పదాలను చేర్చారని, ఇది అసంబద్ధం, చట్టవిరుద్ధమని ఆమె తన పిటీషన్‌లో పొందుపరిచారు. కొంతమంది వ్యక్తులను సంతృప్తిపరిచడానికే తన భర్తపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించినట్లు ఉష బాయి పేర్కొ్నారు. వారిని శాంతింపజేయడానికే తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, ఇందులో ఇతర కారణాల వల్ల కాదని ఆమె వ్యాఖ్యానించారు.

తన భర్తపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం రాష్ట్ర పోలీసు అధికారుల అసమర్థతకు కూడా అద్దం పట్టిందని ఆరోపించారు. శాంతిభద్రతలను నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం మొత్తం విఫలమైనట్లు తాను భావిస్తున్నానని ఉషా బాయి అన్నారు.

కాగా, ఉషాబాయి తరపున న్యాయవాది ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లోపు హోంశాఖ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఆ వివరాలను పరిశీలించనుంది.

రాజా సింగ్‌ను కిందటి నెల ఆగస్టు 23వ తేదీన మొదటిసారి అరెస్టు చేశారు. అదే రోజు ఆయనకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పోలీసులు అదేనెల 26వ తేదీన పీడీ యాక్ట్ కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+