వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీసీ జనాభ లేక్కించండి లేదంటే కోర్టు దిక్కారణ కేసు

|
Google Oneindia TeluguNews

Recommended Video

బీసీ జనాభ లేక్కించండి లేదంటే కోర్టు దిక్కారణ కేసు || Oneindia Telugu

బీసీ జనాభా తోపాటు ,ఓట్ల లెక్కింపు పై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వంపై సిరియస్ అయింది, కోర్టు ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు చేపడతామని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వం పై బీసీ సంక్షేమ సంఘం దిక్కార పిటిషన్ దాఖలు చేసింది.

బీసీ గణన పై గత ఏడాది కోర్టులో పిటిషన్

బీసీ గణన పై గత ఏడాది కోర్టులో పిటిషన్

బీసీ జనాభ లెక్కింపు పిటిషన్ పై స్పందించని తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. గత సంవత్సరం ఇదే అంశంపై హైకోర్టు విచారించింది. ఈనేపథ్యంలోనే ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. కాగా గత సంవత్సరం డిశంబర్ లో బీసీ జనాభ లెక్కింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారి చేసింది. ఆదేశాలు ఇచ్చి మూడు నెలలు కావడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాలపై స్పందించని ప్రభుత్వం

కోర్టు ఆదేశాలపై స్పందించని ప్రభుత్వం

అయితే హైకోర్టు ఆదేశాలపై సంబంధిత బీసీ సంక్షేమ శాఖ నుండి గాని ఇతర డిపార్ట్స్ మెంట్స్ నుండి గాని స్పందన లేకపోవడంతో పటిషనర్ కోర్టు దిక్కార పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో మరోసారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు జూన్ 14 లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారి చేసింది. లేదంటే కోర్టు దిక్కార చర్యగా పరిణగణించవల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఏజీపై సీరియస్ అయింది కోర్టు, కాగా ఈనేపథ్యంలో కొంత గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో కొంత జూన్ 14 వరకు గడువు విధించింది.

బీసీ నాయకుల పిటిషన్

బీసీ నాయకుల పిటిషన్

బీసీ జనాభను లెక్కించి ,దాని ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గత సంవత్సరం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బీసీ జనాభాను ,ఓటర్లను లెక్కించడంతో పాటు ఆ జాబితాను బహిరంగ పర్చి, అభ్యంతరాలను స్వీకరించాలని గత సంవత్సరం జూన్ లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది.

English summary
telangan high court serious on ts government ,be cause of Bc census delay of conter offidavit ,finally warn to govt officials to file counter offidavit on case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X