ఆ 12మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి: స్పీకర్‌కు హైకోర్టు
హైదరాబాద్: టిఆర్ఎస్‌లో టీడీఎల్పీ విలీనంపై హైకోర్టును తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆశ్రయించిన నేపథ్యంలో బుధవారం హైకోర్టు తీర్పు వెలువరిచింది. 3నెలల్లోగా 12మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.
ఈ మేరకు బుధవారం హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ యేడాది మార్చిలో టిడిపిఎల్పీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కాగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.

అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం.. 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను 3 నెలల్లోగా పరిష్కరించాలని స్పీకర్ ను ఆదేశించింది.
రేవంత్ తరపున జంధ్యాల రవిశంకర్ వాదనను వినిపించారు. భారతదేశంలో తొలిసారి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని, స్పీకర్‌కు ఈ మేరకు ఆదేశాలు జారి చేసిందని న్యాయవాది తెలిపారు.












Click it and Unblock the Notifications