అలర్ట్: పది రోజులపాటు తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్నమొన్నటి వరకు వర్షాలు బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. మంగళవారం కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. వడగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TSDPS) వాతావరణ సూచన ప్రకారం.. గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 44 డిగ్రీల పరిధిలో.. కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల నుంచి 29 డిగ్రీల రేంజ్‌లో నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రానున్న మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

summer

బుధవారం వరకు ఏకాంత ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు, మంగళవారం నుంచే హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో ఉక్కపోత మొదలైంది. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో హ్యుమిడిటీ 100 శాతం నమోదైంది. రాబోయే మూడు రోజులపాటు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 42.5, మంచిర్యాల జిల్లా కొమ్మెర, కొండాపూర్‌లలో 42.4, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 42.2, పెద్దపల్లి జిల్లా ముత్తారం, మంచిర్యాల కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 42, కరీంనగర్ జిల్లా వీణవంక, నల్గొండ జిల్లా కట్టంగూర్, మంచిర్యాల జన్నారంలలో 41.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు, మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లిలో 4.23 సెంటీమీటర్లు వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా కాటారంలో 3.9, నల్గొండ జిల్లా మర్రిగూడలో 3.1, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో 2.9, జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 2.5, జయశంకర్ భూపాలపల్లిలో 2.5, సంగారెడ్డి జిల్లా కందిలో 2.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో 2.1 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+