తొలిసారి: తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధికంగా విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 11.01 నిమిషాలకు అత్యధికంగా 15,497 మెగావాట్ల విద్యుత్ నమోదైందని వెల్లడించారు.

మార్చి నెల ప్రారంభం నుంచే 15,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదవుతూ వస్తోందని అధికారులు తెలిపారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడం, వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజు రోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సాగు విస్తీర్ణం కూడా పెరగడం, మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు వినియోగం అధికమవుతుండటంతో అత్యధిక డిమాండ్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

highest power consumption in telangana state: first time after state formation

మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగం వాటానే 37 శాతం ఉండటం గమనార్హం. బుధవారం 14,422 మెగావాట్లు కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధికంగా రికార్డు స్థాయిలో గురువారం 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఇదే తొలిసారి. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది.

విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలోనే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ముందూ ఊహించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి, ప్రజలు, అన్ని రంగాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+