హైదరాబాద్ పాతబస్తీలో కలకలం: రోడ్డెక్కిన విద్యార్థినులు

బెంగళూరు: కర్ణాటకలో హిజబ్ వివాదం ఉగ్రరూపాన్ని దాల్చింది. కళాశాలలు రణరంగంగా మారాయి. ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. మండ్య, బాగల్‌కోటె, శివమొగ్గ, దావణగెరె, యాద్గిర్ వంటి పలు జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఫలితంగా 144 సెక్షన్‌ను విధించాల్సి వచ్చింది.

ముస్లిం విద్యార్థినులు సంప్రదాయబద్ధమైన హిజబ్‌ ధరించి కళాశాలలకు రావడాన్ని అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. తొలుత ఉడుపిలో ఎంజీఎం కళాశాలలో ఈ వివాదం ఆరంభమైంది. క్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపించింది. కొందరు విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి తరగతులకు హాజరు కావడం, హిజబ్ వేసుకున్న విద్యార్థినులను అడ్డుకోవడం వంటి పరిణామాలు సంభవించాయి. అనేక జిల్లాల్లోని కళాశాలల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Hijab row: Protest at Hyderabads Charminar by the students of Unani Hospital

హిజబ్‌ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించడం, దాన్ని ధరించిన విద్యార్థినులకు కళాశాల యాజమాన్యాలు, అధికారులు తరగతులకు హాజరు కావడానికి అనుమతించకపోవడం వంటి పరిణామాలకు నిరసనగా హైదరాబాద్ పాతబస్తీలో విద్యార్థినులు రోడ్డెక్కారు. చారిత్రాత్మక చార్మినార్ వద్ద వారంతా నిరసన ప్రదర్శలు, ఆందోళలను నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిజబ్ ధరించడం తమ హక్కు అంటూ నినదించారు.

వారంతా పాతబస్తీలోని నిజామియా యునాని టిబ్బి ఆసుపత్రి విద్యార్థినులు. ఈ మధ్యాహ్నం తరగతులు ముగిసిన వెంటనే వారంతా గుంపుగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులను ప్రదర్శించారు. హిజబ్ ధరించడం తమ హక్కు అంటూ నినాదాలు చేశారు. తమ మత ఆచారంగా వస్తోన్న హిజబ్‌ను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని అన్నారు. హిజబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని, విద్యార్థినులను తరగతులకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హిజబ్ వివాదంపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం స్పందించిన విషయం తెలిసిందే. హిజబ్ వివాదానికి సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో చూశానని, అవి తనను బాధ, నిరాశకు గురి చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఉర్దూ కవితను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు సంభవించినా.. ఒకేరకమైన మోడస్ ఓపెరాండి కనిపిస్తుంటుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+