హైదరాబాద్ TO వల్పరాయ్.. జస్ట్ రూ. 6 వేలకే హిల్ స్టేషన్ ట్రిప్.. ఎలా వెళ్లాలి..?
తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉన్న వల్పరాయ్ హిల్ స్టేషన్ కు సెవెన్త్ హెవెన్ గా పేరుంది. పశ్చిమ కనుమల్లోని అన్నామలై కొండల మధ్య వల్పరాయ్ హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది. సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం కనువిందు చేస్తోంది. కనుచూపు మేరా పచ్చని కొండలు, టీ, కాఫీ తోటలు, దట్టమైన అడవి, జలపాతాలు, వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఇలా అన్నీ ఒకే చోట కలగలిపి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా అలరిస్తోంది.
వల్పరాయ్ ప్రాంతంలో అనేక టూరిస్ట్ ప్రాంతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తాయి. అలియార్ డ్యామ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 6 గంటలవరకు ఓపెన్ ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 10 ఎంట్రీ టికెట్ ఉంది. అక్కడే అలియార్ డ్యామ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత మంకీ ఫాల్స్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజు రూ. 50 ఉంటుంది. అక్కడే హార్న్ బిల్ వ్యూ పాయింట్ ను సందర్శించవచ్చు. దాంతో పాటు వల్పరాయ్ ప్రాంతంలోనే జంగిల్ వాక్ కూడా ఉంటుంది. అడవిలో వాకింగ్ చేసుకుంటూ చుట్టూ పక్షులు, జంతువుల మధ్య ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. ఇక వల్పరాయ్ ప్రాంతంలో కుజంకాల్ నది కూడా ఉంటుంది.
ఎలా వెళ్లాలి..?
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని వల్పరాయ్ ప్రాంతానికి సొంత వాహనం ఉన్నవాళ్లు కారులో ప్రయాణించవచ్చు. లేదా సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉంటుంది. అయితే వల్పరాయ్ కు డైరెక్ట్ ట్రైన్స్ లేవు. కోయంబత్తూరు వెళ్లి అక్కడి నుంచి బస్సులు, క్యాబ్ ల ద్వారా వెళ్లవచ్చు. శబరి ఎక్స్ ప్రెస్(17230)లో సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూరు చేరుకోవచ్చు. సికింద్రాబాద్ లో ఈ రైలు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. తెల్లారి 7 గంటల 57 నిమిషాలకు కోయంబత్తూరు స్టేషన్ కు చేరుకుంటుంది.

విశాఖపట్నం నుంచి వివేక్ ఎక్స్ ప్రెస్(22504) కోయంబత్తూరు వెళ్తుంది. అలాగే విజయవాడ నుంచి కూడా వివేక్ ఎక్స్ ప్రెస్(22504) లో కోయంబత్తూరు చేరుకోవచ్చు. అలాగే శబరి ఎక్స్ ప్రెస్(17230)లో తిరుపతి నుంచి కోయంబత్తూరు చేరుకోవచ్చు. కోయంబత్తూరు నుంచి వల్పరాయ్ కు డైలీ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. లేదా క్యాబ్స్ లో వెళ్లొచ్చు. బైక్స్ కూడా రెంట్ తీసుకోవచ్చు. ఇక ఒక్కొక్కరికి ట్రైన్ టికెట్ రూ. 5వేల నుంచి రూ. 6 వేల వరకు ఉంటుంది.












Click it and Unblock the Notifications