హైదరాబాద్ లో 22 రద్దీ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ

గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా.. మొత్తం 22 ప్రధాన రహదారులను విస్తరించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 30 మీటర్ల వరకు వెడల్పు ఉన్న రోడ్లు అవి. ఇక అవన్నీ కూడా దశలవారీగా 60 మీటర్ల వెడల్పు వరకు విస్తరణకు నోచుకోనున్నాయి.

ఈ ప్రతిపాదనలపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజాభిప్రాయాలను సేకరించనుంది హెచ్‌ఎండీఏ. దీనికోసం తమ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది. ఈ విస్తరణ పనులన్నీ కూడా పూర్తయితే.. హైదరాబాద్ లో ఇరుకు రోడ్లల్లో ఉండే ఇబ్బందులు దాదాపుగా తొలగిపోయినట్టవుతాయి. వాటికి నూతన రూపురేఖలు ఇచ్చినట్టవుతుంది.

HMDA Prepared a List to Widen 30 to 60 Metre 22 Roads Across Greater Hyderabad to Ease Traffic

హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన విస్తరణ ప్రణాళికలోని ప్రధాన మార్గాలు:

1. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-రాధికా క్రాస్ రోడ్స్ (30మీ-45మీ)

2. హబ్సిగూడ మెట్రో-ఉప్పల్ జంక్షన్-నాగోల్ బ్రిడ్జి (60మీ)

3. ఎన్జీఆర్ఐ మెట్రో (హబ్సిగూడ)-ఎన్ఎండీసీ రామంతాపూర్ (12మీ-24మీ)

4. చాదర్‌ఘాట్ జంక్షన్-నింబోలి అడ్డ-అంబర్‌పేట (60మీ)

5. వనస్థలిపురం-కామినేని హాస్పిటల్స్ జంక్షన్ (30మీ)

6. నాగోల్ మెయిన్ రోడ్డు-సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (36మీ)

7. ఎల్బీ నగర్ బస్టాప్-బైరామల్‌గూడ ఫ్లైఓవర్-టీచర్స్ కాలనీ-హస్తినాపురం నార్త్ (24మీ)

8. బైరామల్‌గూడ జంక్షన్-కర్మన్‌ఘాట్ చంపాపేట్ (60మీ)

9. ఐఎస్ సదన్ క్రాస్ రోడ్స్-చంపాపేట్ రోడ్ (45మీ)

10. ఓవైసీ హాస్పిటల్ (35మీ/45మీ/60మీ), మీర్ ఆలం ట్యాంక్-ఆరాంఘర్ గగన్‌పాహాడ్ (60మీ)

11. ఎల్బీ నగర్ జంక్షన్- పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ 117 (మూసీనది బ్రిడ్జి) ఆరాంఘర్ (ఇన్నర్ రింగ్ రోడ్),

12. జాతీయ రహదారి నంబర్ 44 (5 లైన్ల రోడ్డు) (24మీ)

13. జీవీకే మాల్ జంక్షన్ (రోడ్ నెం.14, బంజారాహిల్స్)-కేబీఆర్ పార్క్ (24మీ)

14. మల్లేపల్లి నోబుల్ టాకీస్-ప్రియా థియేటర్-రవీంద్రభారతి స్కూల్ (24మీ)

15. మన్సూరాబాద్-హైటెక్ సిటీ జంక్షన్-మాదాపూర్ పోలీస్ స్టేషన్-మాదాపూర్ మెట్రో స్టేషన్ (36మీ)

16. ఆనంద్ నగర్ బండ్లగూడ-ఎన్ హెచ్-44 ఆల్వాల్ సర్కిల్ (హెచ్-లైన్ రోడ్డు) (24మీ)

17. నల్లకుంట వెజిటబుల్ మార్కెట్ రోడ్-సాయి బాబా టెంపుల్ రోడ్ జంక్షన్ (స్ట్రీట్ నెం.17) (24మీ)

18. మార్వాడీ లా కాలేజ్ (ఇసామియా బజార్)-సుందరయ్య పార్క్ (30మీ)

19. ఆరాంఘర్ క్రాస్ రోడ్స్-హిమాయత్ సర్కిల్-ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (30మీ)

20. నేరెడ్‌మెట్ క్రాస్ రోడ్స్-సఫిల్‌గూడ లేక్-ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ (30మీ)

21. ఉప్పల్ రింగ్ రోడ్ (60మీ)

22. కాటేదాన్ దుర్గానగర్ ఓల్డ్ కర్నూల్ రోడ్, బెంగళూరు హైవే అప్రోచ్ రోడ్ వరకు (60మీ) విస్తరణ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+