తెలంగాణలో ఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఐచ్చిక సెలవును ప్రకటించింది. మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ.. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఈ మేరకు సవరిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నేటి నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తైన విద్యార్ధులకు (2023-24) ఈ మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఈ
క్యాలెండర్ అమలు అవుతుందని బోర్డ్ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉండగా.. 75 రోజులు సెలవులు వచ్చాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులకు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి వెల్లడించారు.
అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం..
అక్టోబర్ 6 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 14న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి
నవంబర్ 18 నుంచి 23వ తేదీవరకు హాఫ్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి.
2025 జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.
జనవరి 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు
ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి మొదటి వారం థియరీ పరీక్షలు జరుగుతాయి.
మే 2025 చివరి వారంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.
2024-25 విద్యా సంవత్సరానికి చివరి పనిదినం మార్చి 29.
మార్చి 30 నుంచి జూన్ 1, 2025 వరకు వేసవి సెలవులు.
2025-26 విద్యాసంవత్సరానికి జూన్ 2 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications