స్కూళ్లు రీ ఓపెన్ అయిన వెంటనే మళ్లీ సెలవులు, ఇదీ జాబితా..!!
విద్యా సంస్థలకు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో తిరిగి పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్లు ప్రకటించాయి. ఏపీలో విద్యా కానుక సిద్దం చేస్తున్నారు. బడులు తెరిచిన వారంలోగా తల్లికి వందనం నిధులు అందించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలు అమలు చేస్తోంది. కాగా, వేసవి సెలవులు ముగిసిన తరువాత కూడా పాఠశాలలకు వరుస సెలవులు రానున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో మొదలైన వేసవి సెలవులు ఈ నెల 11వ తేదీతో పూర్తి కానున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ పాఠశాలులు ఓపెన్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే.. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తెరుచుకున్నా... ఈ నెలలో విద్యార్ధులకు ఇంకా సెలవులు మాత్రం కంటిన్యూ కానున్నాయి. పాఠశాలలకే కాదు.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సైతం ఈ సెలవులు వర్తించనున్నాయి. జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆ మరుసటి రోజునే 13వ తేదీ రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు. అదే విధంగా జూన్ 21 మళ్లీ ఆదివారం. ఇక, జూన్ 26న మొహర్రం పండుగ సెలవు ప్రకటించారు.

ఈ నెలలో మరిన్ని సెలవులు
కాగా, ఈ నెల 28న మళ్లీ ఆదివారం. దీంతో.. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయినా.. ఈ నెలలోనే ఈ సెలవులు రానున్నాయి. అదే విధంగా బ్యాంకు ఉద్యోగులకు సైతం ఈ నెల 7, 14, 21, 28 తేదీలు ఆదివారాలు బ్యాంకులకు సెలవు. ఇక జూన్ 13న రెండో శనివారం కూడా సెలవు. జూన్ 26న మొహర్రం పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుగా ప్రకటించారు. జూన్ 27 తేదీన నాలుగవ శనివారం. ఇలా మొత్తంగా జూన్ నెలలో బ్యాంక్ ఉద్యోగులకు ఏడు రోజుల పాటు హాలీడేస్ రానున్నాయి. కొంచెం అటు ఇటుగా ఇవే సెలవులు రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. దీంతో.. వేసవి సెలవులు అయిపోతున్న వేళ.. ఈ నెలలో రానున్న సెలవులు విద్యార్ధుల్లో జోష్ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications