సంక్రాంతికి కట్: బతుకమ్మకే తెలంగాణ సెలవులు

హైదరాబాద్: తెలంగాణాలో బతుకమ్మ పండుగకు మరింత ప్రాముఖ్యతను కల్పిస్తూ దసరాకు పాఠశాలలకు 15 రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణాలో దసరా, బతుకమ్మ పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

ఈ దృష్ట్యా సంక్రాంతి పర్వదినానికి ఇచ్చే సెలవు దినాలను తగ్గించి, బతుకమ్మ పండుగకు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సంక్రాంతికి తెలంగాణాలో అంతగా ప్రాధాన్యం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని నిర్వహించినంతగా తెలంగాణాలో ఉండదు. అందుకే సంక్రాంతికి సెలవులను రెండు రోజులకే కుదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు.

Holidays will be for Dasara in Telangana

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఈ నూతన సెలవుల క్యాలండర్‌ను విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థినీ విద్యార్ధులను బతుకమ్మ, సంక్రాంతి పండుగలలో మరింత ఎక్కువగా పాల్గొనేటట్టు చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో బుధవారంనాడు బతుకమ్మ సందడి ప్రారంభమైంది. ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతో తొలి రోజు బుధవారం పెద్ద యెత్తున తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+