మహిళపై అత్యాచారయత్నం చేసిన హోం గార్డు

హైదరాబాద్: ఓ హోంగార్డు ఓ అమాయక మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. హైదరాబాదు నగరంలోని ఎల్బీ నగర్‌లో ఉన్న తిరుమల కాలనీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

ఇదిలావుంటే, హైదరాబాదు నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

Home gaurd attempts to rape a girl

ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరి వ్యక్తుల నుంచి రూ. 25 వేల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం వద్ద వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతుల్లో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నలుగురిలో ఇద్దరిని సంగారెడ్డి ఆస్పత్రికి, మరో ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+