మహిళ కలిసింది: హోంగార్డు ఆత్మహత్య (పిక్చర్స్)

హైదరాబాద్:విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. సికిందరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మహంకాళి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ డిడి సింగ్ ఇందుకు సంబందించిన వివరాలు అందించారు.

హైదరాబాదు నగరంలోని చింతల్‌కు చెందిన హోంగార్డు బాల్‌రాజ్ (44) గత ఎనిమిది మాసాలుగా మహంకాళి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం మహంకాళి దేవాలయం ఎదుట విధుల్లో ఉన్న హోంగార్డు బాల్‌రాజ్ కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగాడు.

నురుగులు కక్కుతూ పడిపోయిన బాల్‌రాజ్‌ను గమనించిన పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ఎదురుగావున్న సిసి కెమెరాలో రికార్డు కూడా అయింది.

ఓ మహిళ కలిసింది..

ఓ మహిళ కలిసింది..

బాల్‌రాజ్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక మహిళ వచ్చి అతనిని కలిసి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ స్థితిలో బాలరాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది అంతు బట్టడం లేదు.

భార్యతో గొడవ

భార్యతో గొడవ

బాలరాజ్ తన భార్యతో గురువారం ఉదయం గొడవ పడ్డాడని, మధ్యాహ్నం విధులకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

నాయకుడు కూడా..

నాయకుడు కూడా..

హోంగార్డు బాల్‌రాజ్ తెలంగాణ హోంగార్డుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

తీవ్ర దిగ్భాంతి

తీవ్ర దిగ్భాంతి

హోంగార్డు బాలరాజ్ ఆత్మహత్య ఘటన తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటను ఎందుకు జరిగిందినేది తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+