షాక్: మహిళా డీఎస్పీకే వేధింపులు, సీక్రెట్‌గా ఫోటోలు తీసిన హోంగార్డ్

హైదరాబాద్: సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా డీఎస్పీకే వేధింపులు తప్పలేదు. అదే విభాగంలో పని చేస్తున్న హోంగార్డు ఆమె ఫోటోలను సెల్ ఫోన్ ద్వారా తీశాడు. ఇది వెలుగుచూడటంతో అతనిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది.

సీఐడీ విభాగంలో కిందిస్థాయిలో పని చేస్తున్న సదరు ఉద్యోగి తన సెల్ ఫోన్లో రహస్యంగా బాధిత మహిళా డీఎస్పీ ఫోటోలను తీశాడు. దీంతో ఆమె అవాక్కయింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

సీఐడీలో పని చేస్తున్న మహిళా డీఎస్పీ ఒకరు ఇటీవల అధికార పని నిమిత్తం తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగానికి వచ్చారు. ఆమెకు తెలియకుండా హోంగార్డు తన ఫోన్లో ఆమె ఫోటోలు దీశాడు. ఈ విషయాన్ని సహచరులు చెప్పారు. దీంతో ఫోన్లో పరిశీలించగా ఆమె ఫోటోలు ఉన్నాయి. చర్యలు తీసుకున్నారు.

Home Guard suspended for taking photos of Woman DSP

వేములవాడలో బాలుడు అదృశ్యం

కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు నెలల బాబును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. నల్గొండ జిల్లా ఆలేరు మండలం బొందుగుల గ్రామానికి చెందిన కనకవ్వ సోమవారం కుంటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శనం కోసం వేములవాడకు వచ్చారు.

స్వామివారి దర్సనం అనంతరం వారు ఆలయ ఆవరణలోని ఓపెన్‌ స్లాబ్‌పై నిద్రించారు. మంగళవారం ఉదయం లేచి చూసేసరికి బాలుడు కనిపించలేదు. కనకవ్వ కుటుంబ సభ్యులు ఆలయంలో గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+