నిర్మల్ కు అమిత్ షా - కేసీఆర్ ఇలాకాలో రేవంత్..ఖర్గే సభ : రేపు తెలంగాణలో కీలక సమీకరణాలకు వేదికగా..!!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవలనే లక్ష్యంతో కాంగ్రెస్ - బీజేపీ రెండు పార్టీలో తెలంగాణ లో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా టీపీసీసీ పగ్గాలు రేవంత్ కు ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తిగా మద్దతిస్తోంది. ఇప్పటికే రేవంత్ తమ పార్టీకి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న ఓట్ బ్యాంక్ ను కాపాడుకొనేందుకు ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా.. దళిత-గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహిస్తున్నారు.

ఇక, రేపు (సెప్టెంబర్ 17) పైన చాలా కాలంగా చర్చ సాగుతోంది. విలీనమా- విమోచనా అనే అంశం పైన ఈ చర్చ సాగుతూనే ఉంది. ఇదే సమయంలో తెలంగాణ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆయన నాందేడ్ నుంచి అదిలాబాద్ జిల్లా నిర్మల్ చేరుకుంటారు. అక్కడ రజాకార్ల చేతితో వేయి మంది బలైన ప్రాంతమైన ఉరులమర్రి లో అమిత్ షా సభ జరగనుంది. ఆ సభలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అదే విధంగా గులాబీ-కాషాయం రెండు పార్టీలు ఒకటేనంటూ వస్తున్న విమర్శలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Home Minister Amith Shah and Kharge from congress meetings in Telangana on same day

దీంతో..పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రం సైతం రేపు నిర్మల్ చేరుకోనుంది. ఇక, ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు టీపీసీసీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకుముందు ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించారు.

అనంతరం రావిర్యాల, మూడుచింతలపల్లిలో సభలు సక్సెస్‌ చేశారు. చివరి సభను గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ వద్ద గల మైదానంలో జరగనున్న సభకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. సభను విజయవంతం చేసేందుకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు కష్టపడుతున్నాయి. సభకు లక్ష మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+