Brutal Murder: ఇది కాదా కలికాలం.. నిండు చూలాలి కడుపుపై కూర్చున్న భర్త.. ఏమైందంటే..?
రాను రాను మనిషిలో విచ్చలవిడితనం, పైశాచికత్వం పెరిగిపోతోంది అని అనడానికి నిదర్శనమే ఈ కథనం. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన వింటే.. ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందే. అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కిరాతకుడు. భార్య నిండు చూలాలు అని తెలిసి కూడా ఆమెపై కూర్చుని అతికిరాతకంగా హతమార్చాడు. అంతేకాక ఆమె కడుపులోని శిశువు ప్రాణాలు సైతం తీసి పైశాచికానందం పొందాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది.
ఏం జరిగిందంటే.. ?
హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణ(21), కాప్రాకు చెందిన స్నేహ(21) సామాజికమాధ్యమమైన ఇన్ స్టాలో పరిచయమయ్యారు. కొద్దికాలంలోనే వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. సచిన్ రాక్షస బుద్ధిని గ్రహించని స్నేహ.. అతని మాయమాటలకు మోసపోయింది. సచిన్ కు తనపై ఉన్నది కపట ప్రేమేనని అర్థం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలో వీరి వివాహం 2022లో జరిగింది.

రూ. లక్షకు బాబును అమ్మి..
మొదట్లో సచిన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పనిచేశాడు. అయితే పలు కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని మానేసి జులాయిగా మారాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టాడు. ఇంతలోనే వారికి 2023లో బాబు జన్మించాడు. ఆ సమయంలోనే సచిన్ లో దాగి ఉన్న రాక్షసుడు తొలి సారి బయటకు వచ్చాడు. జల్సాలకు అలవాడుపడిన సచిన్ డబ్బుకోసం ఏకంగా కన్న కొడుకునే అమ్మేయాలని పథకం వేశాడు. చిన్నారిని పాతబస్తీలోని ఓ వ్యాపారికి రూ. లక్షకు విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.
ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేశాడు. దీన్ని గ్రహించిన స్నేహ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చిన్నారిని రక్షించి తల్లికి అప్పగించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ బాలుడు కొద్ది నెలల్లోనే మృతిచెందాడు. అనుమానస్పద స్థితిలో బాలుడి మృతి చెందడంతో సచిన్, స్నేహల మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరాయి. కొన్నాళ్లపాటు ఇద్దరూ విడిగా ఉన్నారు.
మాయమాటలు నమ్మి..
అయితే తాను మారానని మాయమాటలు చెప్పి మరోసారి స్నేహకు దగ్గరయ్యాడు సచిన్. దీంతో మరోసారి భర్తను గుడ్డిగా నమ్మింది స్నేహ. 2023 డిసెంబర్ నుంచి కాప్రాలోని ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని కలిసి ఉన్నారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకు స్నేహ గర్భం దాల్చింది. భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు గ్రహించిన సచిన్.. ప్రెగ్నెంట్ ఎలా అయ్యావంటూ రోజూ వేధించసాగాడు. ఈ క్రమంలోనే స్నేహను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా జనవరి 16న తెల్లవారుజామున 5 గంటలకు.. స్నేహ నిద్రిస్తున్న సమయంలో సచిన్ ఆమె కడుపుపై కూర్చున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో గట్టిగా నోరు మూసి ఊపిరి ఆడకుండా చేశాడు. స్నేహ నిండు చూలాలు కావడంతో సచిన్ బరువుకు ఆమె కడుపులోంచి శిశువు బయటకు వచ్చి మృతిచెందింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి స్నేహ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
హత్యగా చిత్రీకరించాలని..
స్నేహ మృతిచెందినట్లు నిర్ధారించుకున్న సచిన్.. మరోసారి తన క్రిమినల్ మైండ్ ను ఉపయోగించాడు. తన భార్య మరణం ప్రమాదవశాత్తూ జరిగినట్లుగా చిత్రీకరించాలని భావించి కిచెన్ లోని సిలిండర్ గ్యాస్ లీక్ చేశాడు. కానీ ఆ గ్యాస్ బయటకు వెళ్లడంతో ప్లాన్ విఫలం అయింది. దీంతో అక్కడినుంచి పరారయ్యాడు. మూడురోజుల తర్వాత ఇంట్లోనుంచి కుళ్లిన వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సచిన్ ప్రధాన నిందితుడని భావించి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాచిగూడ వద్ద అతడ్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications