కొత్త టెక్నాలజీ: 120 జాకీలతో ఇంటిని పైకెత్తారు
హైదరాబాద్: సాధారణంగా జాకీలు ఎందుకు వాడతామని అడిగితే.. కారు లేదా బస్సు పంచరైతే ఎత్తడానికి అని సమాధానమిస్తాం. అదే జాకీలతో ఒక ఇంటి ఎత్తును పెంచవచ్చంటే నమ్ముతారా? నగరంలోని చంపాపేట ఎస్‌బీఐ ఆఫీసర్స్ కాలనీలో కొన్నేళ్ల క్రితం పడిగిమర్రి రమేష్ ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరిగింది.
దీంతో వర్షం పడినప్పుడు వీధిలోని నీళ్లన్నీ ఇంటిలోకి వస్తున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో వెతుకున్న సమయంలో రమేష్‌కు హర్యానాలోని శ్రీరామ్ బిల్డింగ్ లిఫ్టింగ్ వర్క్స్ అనే సంస్ధ గురించి తెలుసుకుని వారిని సంప్రదించాడు.
చెన్నై, కేరళ, పంజాబ్, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఇంటి యజమానుల అవసరాల మేరకు ఇళ్లను అప్ లిఫ్ట్ చేస్తున్న ఈ సంస్ధ రమేష్ ఇంటిని కూడా అదే పద్ధతిలో పైకి లేపే పని మొదలు పెట్టింది.

పునాది భాగంలో జాకీలు అమర్చి, బిల్డింగ్ పిల్లర్లను అడుగుభాగం నుంచి పైకి ఎత్తుతోంది. ఐదు రోజుల క్రిందట ప్రారంభమైన ఈ పనులతో ఇప్పటికే ఒక ఎత్తు పైకి లేపారు. మొత్తం ఐదు అడుగులు ఎత్తేందుకు పనులు చేపట్టారు.
20 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని సంస్ధ నిర్వాహకుడు వికాస్ సిసోడియా తెలిపారు. ప్రస్తుతం అక్కడ 10 మంది ఫోర్‌మెన్‌లు, 120 జాకీలతో పని చేస్తున్నామని తెలిపారు. ఇక ఇంటిని ఎత్తేందుకు అయ్యే ఖర్చు చదరపు అడుగుకి 300 రూపాయలు.
ఇప్పటి వరకు ఈ కంపెనీ వారు 12 అడుగుల ఎత్తు వరకు హర్యానాలో ఓ బ్రిడ్జిని లిప్ట్ చేసారట. 1991లో మొదలు పెట్టిన ఈ బిజినెస్‌తో ఇప్పటి వరకు 500పైగా బిల్డింగులను, బ్రిడ్జ్‌లను పైకేత్తారని తెలిపారు. సాధారణంగా ఇలాంటి బిల్డింగ్‌లను పడగొట్టి కట్టాలంటే లక్షల్లో ఖర్చవుతోంది.
అంతే కాదు నెలల తరబడి ఎదురు చూడాలి కానీ ఈ టెక్నాలజీతో అవి రెండు కలిసి వస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications