పెళ్లయిన రెండో రోజే: పిజ్జా కావాలన్న భార్య.. తీసుకొచ్చిన భర్తకు షాక్!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాహం నచ్చలేదో.. లేక ఇంకేమైనా కారణాలో తెలియదు కానీ పెళ్లయిన మరుసటి రోజే ఓ వివాహిత భర్త కళ్లు గప్పి పారిపోయింది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం ఆర్‌ఎల్‌ నగర్‌కు చెందిన మాదినేని తిరుపతయ్య (23) పాల వ్యాపారికి, కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరికి(19) ఈ నెల 1న వివాహం జరిగింది. మైదుకూరులోని రాఘవేంద్ర స్వామి దేవాలయంలో వివాహం అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకుని వచ్చాడు.

పెళ్లయిన మరుసటిరోజే మల్లేశ్వరి సినిమాకు వెళ్దామని భర్తను అడిగింది. భార్య కోరిక మేరకు ఈ నెల 2న భర్త కుషాయిగూడలో సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసి తిరిగి వస్తుండగా.. మల్లేశ్వరి పిజ్జా కావాలని అడిగింది. దీంతో పిజ్జా తీసుకురావడానికి రోడ్డుకు అటువైపు ఉన్న షాపులోకి తిరుపతయ్య వెళ్లాడు.

తిరిగి వచ్చి చూసేసరికి భార్య అక్కడ కనిపించలేదు. కాస్త దూరంలో వెళ్తున్న ఓ ఆటోలో భార్య ఉండటాన్ని అతను గమనించాడు. ఆపై ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirupataiah, A local merchant in Medchal was complainted to police regarding his wife missing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి