వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ ఆదేశాలు, కొత్త ఎత్తుగడ: నమస్తే తెలంగాణ పత్రిక కొనాలని..!?

తెరాస ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంచార్జులకు, జిల్లా అధ్యక్షులకు టార్గెట్లు పెట్టి మరీ నమస్తే తెలంగాణను ముడిపెట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా మరో షాకింగ్ అంశం వెలుగు చూసిందని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంచార్జులకు, జిల్లా అధ్యక్షులకు టార్గెట్లు పెట్టి మరీ నమస్తే తెలంగాణను ముడిపెట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా మరో షాకింగ్ అంశం వెలుగు చూసిందని అంటున్నారు. అన్ని పాఠశాలలు కచ్చితంగా నమస్తే తెలంగాణ పత్రిక వేయించుకోవాలని చెబుతున్నారట.

ఈ మేరకు సర్క్యులర్ జారీ అయినట్లు కూడా జారీ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సర్క్యులర్ ఓ విపరీత చర్య అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆ పత్రిక విషయంలో టార్గెట్లు పెట్టారని, దానిని రీచ్ కాలేకపోతే మీ వార్తలు ఆపేస్తామని అంటున్నారని అంటున్నారు.

government

ఇప్పుడు ఏకంగా స్కూళ్లు అదే పత్రికను వేసుకోవాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేయడం, ఇందుకు సర్క్యులర్ వచ్చిందని ప్రచారం జరగడం చర్చకు దారి తీసింది. ప్రభుత్వ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, జెడ్పీ స్కూళ్లు వేలాదిగా ఉంటాయి. అదే పత్రిక అంతటా వేయించుకుంటే పత్రిక సర్క్యూలేషన్ బాగా పెరుగుతుందనే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు తదితరులు టార్గెట్ పెట్టడంతో వారే చందాలు కట్టి పేపర్లు వేయించుకుంటున్నారని, కానీ వాటిని ఎవరికి పంచాలో తెలియక కట్టలు అలాగే ఉంటున్నాయని అంటున్నారు.

ఇలా, సేల్ అయినా కాకపోయినా.. ఇది సర్క్యులేషన్ ఎక్కువ చూపించేందుకు ఉపయోగపడుతుందని, అప్పుడు ప్రభుత్వ యాడ్స్ కూడా ఆ మేరకు తీసుకోవచ్చుననేది ఇందులోని మరో ఎత్తుగడ అని ప్రచారం సాగుతోంది. నమస్తే తెలంగాణకు ఏబీసీ సర్టిఫికేట్ లేదని, ఏ రీడర్ షిప్ సర్వే వివరాలో చూపించి యాడ్స్ తీసుకోవాలని గుర్తు చేస్తున్నారు.

English summary
How can government order to subscribe a particular daily?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X