Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహేందర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ ఎలా అయ్యారు?: బలమైన ఆధారమంటూ హరీశ్ రావు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖునీ చేస్తున్నారన్న హరీశ్ రావు.. ఇందుకు మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకమే మరో ఉదాహరణ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

మండలిలో బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడటం చీఫ్ విప్ బాధ్యత అని.. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయన అధికార పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ కు కూడా మండలిలో విప్ ఉంటారని, సభకు హాజరు, బిల్లుపై ఓటింట్ సమయంలో బీఆర్ఎస్ విప్ కూడా పార్టీ సభ్యులకు విప్ ఇస్తారని హరీశ్ రావు చెప్పారు.

How did Mahender Reddy become the Chief Whip of the government Harish Rao

ఈ క్రమంలో బీఆర్ఎస్ విప్.. ప్రభుత్వ విప్ కు కూడా విప్ ఇస్తారని హరీశ్ రావు అన్నారు. చీఫ్ విప్ ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రకారం నడుచుకుంటారా? అని ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని హరీశ్ రావు మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సంబంధం లేదని అన్నారని.. ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఎలా ఇచ్చారని హరీశ్ రావు ప్రశ్నించారు.

అంతేగాక, మహేందర్ రెడ్డిపై ఛైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని హరీశ్ రావు తెలిపారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఛైర్మన్ బులెటిన్ ఇచ్చారని అన్నారు. మహేందర్ రెడ్డిపై అనర్హత పిటిషన్ కు ఇంతకుమించిన ఆధారం ఇంకా ఏం ఉంటుందని హరీశ్ రావు ప్రశ్నించారు. ఛైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్ కు మరింత బలం ఇచ్చిందని.. ఆ బులెటిన్ ను కూడా అనర్హత పిటిషన్ లో సాక్ష్యంగా చేరుస్తామని హరీశ్ రావు తెలిపారు.

ఎమ్మెల్సీ హోదాలోనే ఆగస్టు 15, సెప్టెంబర్ 17న మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారని, మార్చి 15వ తేదీ నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని ఎలా బులెటిన్ ఇచ్చారని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ తోపాటు డీవోపీటీకి కూడా లేఖ రాస్తామని తెలిపారు. గవర్నర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+