బావుల్లో ఎన్ని బాడీలో.. ! హాజీపూర్ లో ఉన్న బావులన్నీ తవ్విస్తున్న సైకో శ్రీనుగాడు..!!

భువనగిరి/హైదరాబాద్ : వేములవాడ సమీపంలోని అగ్రహారం గుట్టల్లో గత నెల 21న ఓ యువతి మృతదేహం లభ్యంకాగా, ఆమె ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి, వేములవాడ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించానని, ఆమెను వివాహం చేసుకోవాలని భావించానని పోలీసుల విచారణలో వెల్లడించడంతో, 21న లభ్యమైన యువతి మృతదేహం ఆమెదే కావచ్చేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు చందుర్తి, వేములవాడకు చేరుకుని విచారించినా, ఫలితం లేకపోయింది. ఆసలు శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి బతికే ఉందా? అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు.

అసలు శ్రును గాడి లవర్ బతికుందా..! బావి పాలైందా..!!

అసలు శ్రును గాడి లవర్ బతికుందా..! బావి పాలైందా..!!

ఉన్మాది మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. ముగ్గురు బాలికలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన బావుల్లో మరోసారి తవ్వకాలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి పాడుబడిన రెండు బావుల్లో మృతదేహాలను పూడ్చి వేయగా పోలీసులు వెలికి తీసిన విషయం తెలిసిందే.

అంతులేని ఘోరాలు..! బావుల్లో ఎన్ని బాడీలున్నాయో..!!

అంతులేని ఘోరాలు..! బావుల్లో ఎన్ని బాడీలున్నాయో..!!

జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, జేసీ రమేష్‌, డీసీపీ కె.నారాయణరెడ్డిలతో కూడిన అధికార బృందం ఆదివారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో మాట్లాడింది. గ్రామ శివారులో పాడుబడిన బావులను పూడ్చివేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. సైకో శ్రీనివాస్‌రెడ్డి మరిన్ని ఘోరాలకు పాల్పడి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.

అన్ని బావులను తవ్వి చూడాలనుకుంటున్న పోలీసులు..! శ్రీనుగాడి అంతులేని నేరాలు..!!

అన్ని బావులను తవ్వి చూడాలనుకుంటున్న పోలీసులు..! శ్రీనుగాడి అంతులేని నేరాలు..!!

బావులను పూడ్చివేసేముందు మరోసారి తవ్వకాలు చేపట్టి అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్న అభిప్రాయాలు గ్రామస్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోని విచారించనున్నారు. విచారణ పూర్తయ్యాక పూడ్చివేతలపై రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ వెల్లడించారు.

ఆ బావుల్లో మరోసారి తవ్వకాలు చేపట్టాకే పూడ్చివేత..! అసలు శ్రీను లవర్ ఏమైనట్టు..!!

ఆ బావుల్లో మరోసారి తవ్వకాలు చేపట్టాకే పూడ్చివేత..! అసలు శ్రీను లవర్ ఏమైనట్టు..!!

శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై లోతుగా దర్యాప్తు సాగించడంతోపాటు ముగ్గురు బాలికలను దారుణంగా హతమార్చిన సంఘటనలపై బలమైన సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అతనికి కఠిన శిక్షపడేలా శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లోని మహిళా స్నేహితులపై ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+