తెలంగాణలోనే తక్కువ టెస్ట్‌లు ఎందుకు..? వివరాలు అందజేయండి, టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్‌లను సామర్థ్యం మేరకు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సూర్యాపేటలో టెస్ట్‌లు చేయడం లేదని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషినర్ వాదనలు విన్న ధర్మాసనం... ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
సూర్యాపేటలో కరోనా వైరస్ పరీక్షలు ఎందుకు చేయడం లేదు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్షలు చేయకుంటే ఎలా.. ప్రజలు భయాందోళనకు గురికారా అని అడిగింది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న సూర్యాపేటలో పరీక్షలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించింది. పరీక్షలు చేయకుంటే వైరస్ వ్యాపించి.. మరింత ప్రమాదం కాదా అని అడిగింది.

సూర్యాపేటతోపాటు రాష్ట్రంలో గతనెల 24వ తేదీ నుంచి ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు చేశారని అడిగింది. వలసకూలీల వస్తున్నందన కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రభుత్వ ల్యాబులతోపాటు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిస్తే బాగుంటుందని సూచించింది. కేరళలో మాదిరిగా మొబలై టెస్ట్ చేసే చర్లు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దేశంలో కన్నా తెలంగాణలో తక్కువ టెస్ట్‌లు చేశారని.. ధర్మాసనం ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేసింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications