మధ్యంతర బెయిల్: ఆ 12 గంటలు ఎమ్మెల్యే రేవంత్ ఏం చేశారు?
హైదరాబాద్: కుమార్తె నిశ్చితార్ధం కోసం మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టు అనుమతి కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
రేవంత్ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు రూ. 50 వేల పూచీకత్తుతో గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మధ్యంతర బెయిల్‌పై విడుదలై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ 12 గంటలను ఎలా గడిపారో ఒక్కసారి చూద్దాం.
* గురువారం ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదలయ్యారు.
* ఉదయం 6.40 గంటలకు జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు.
* 8 గంటలకు భార్య గీత, కుమార్తె నైమిశతో కలిసి ఇంటి నుంచి బయలుదేరి, నిశ్చితార్థ వేదికైన ఎన్ కన్వేన్ష్‌న్‌కు చేరుకున్నారు.
* 10 గంటలక వరకు ఎన్ కన్వేన్ష్‌న్ వద్ద నిశ్చితార్ధ ఏర్పాట్లను పర్యవేక్షంచారు.
* నిశ్చితార్ధం కార్యక్రమం 10.15 గంటలకు ప్రారంభమైంది.
* మధ్యాహనం 2.30 గంటలకు కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
* 3 గంటల ప్రాంతంలో తిరిగి తన నివాసానికి చేరుకున్నారు.
* 3 గంటల నుంచి 4 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడిపారు.
* కుటుంబ సభ్యులతో గంట సేపు గడిపిన రేవంత్ రెడ్డి 4 గంటలకు ఇంటి నుంచి చర్లపల్లి జైలుకు బయలుదేరారు.
గంట ముందుగానే జైలుకు చేరుకున్న రేవంత్ రెడ్డి:
ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు జైలుకు బయలుదేరి వెళ్లారు. రెండు గంటల సమయం ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల్లోగానే జైలుకు తిరిగి వెళ్లాలన్న నిబంధన ఉండటంతో ముందే బయల్దేరినట్లు తెలుస్తోంది.
సాయంత్రం 5 గంటలకే ఆయన చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. చాలామంది ఆయనను కలిసేందుకు జైలు వద్దకు వచ్చినా, ఆయన మాత్రం ముందుగానే జైలు లోపలకు వెళ్లిపోయారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications