మహబూబ్‌నగర్ వాసులకు బంపర్ ఆఫర్.. పూర్తిగా ఉచిత వైద్యం!

సాధారణంగా ఆసుపత్రి గడప తొక్కాలంటేనే సామాన్యుడికి గుండెల్లో దడ మొదలవుతుంది. డాక్టర్ ఫీజులు, రక్త పరీక్షల ఖర్చులు, మందుల బిల్లులు తలచుకుంటేనే సగం జబ్బు ముదిరిపోతుంది. కానీ, మహబూబ్‌నగర్ ప్రజలకు మాత్రం ఆ భయం లేకుండా పోయింది. ఎందుకంటే, అక్కడ నయా పైసా ఖర్చు లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్ల పర్యవేక్షణలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి.

2026 సెప్టెంబర్ నాటికి ఈ 'ఆరోగ్య సేవా కేంద్రం' ద్వారా ఏకంగా 5,045 మంది ఉచిత వైద్య సేవలు పొందారంటే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు సగటున 19 మంది చొప్పున ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. ముఖ్యంగా 45 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న మధ్యవయస్కులు, వృద్ధులకు ఈ కేంద్రం ఒక వరంలా మారింది. నేటి కాలంలో ప్రతి ఇంట్లో వేధిస్తున్న బీపీ , షుగర్ , సాధారణ జ్వరాలకు ఇక్కడ నిరంతరాయంగా చికిత్స అందుతోంది.

How Star Health CSR Initiative in Mahabubnagar Delivered Free Healthcare Services to 5 045 Local Citizens

ఆసుపత్రికి వెళ్లాలంటే ఖర్చు, దూరం అడ్డుకాకూడదు!

చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్లనో, దూరభారం వల్లనో వ్యాధి ముదిరే వరకు ఆసుపత్రికి వెళ్లరు. అలాంటి అడ్డంకులను తొలగించి, ప్రజల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలను ఒక అలవాటుగా మార్చడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఒక అనుభవజ్ఞుడైన ఎంబీబీఎస్ డాక్టర్, నర్సు, సహాయక సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

రిటైర్మెంట్ ప్రకటించిన ఆపద్బాంధవురాలు! ఆకాశంలో అమృత స్పర్శ..
రిటైర్మెంట్ ప్రకటించిన ఆపద్బాంధవురాలు! ఆకాశంలో అమృత స్పర్శ..

ఇక్కడ ఏమేం సేవలు ఉచితంగా అందుతాయంటే..

  • నిపుణులైన డాక్టర్ కన్సల్టేషన్: ఎలాంటి ఫీజు లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్ల ద్వారా వైద్య పరీక్షలు.
  • ల్యాబ్ టెస్టులు: బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ వంటి కీలక పరీక్షలు.
  • స్క్రీనింగ్ & కౌన్సిలింగ్: హైపర్‌టెన్షన్, మధుమేహం, నోటి సంబంధ ఆరోగ్య సమస్యల గుర్తింపు, సరైన జీవనశైలిపై హెల్త్ కౌన్సిలింగ్.
  • మందులు & టీకాలు: సాధారణ, తీవ్ర అనారోగ్యాలకు అవసరమైన ఔషధాలతో పాటు, అర్హులైన వారికి ఖరీదైన న్యూమోకాకల్ టీకాలు కూడా పూర్తిగా ఉచితం.

ఇంతటి మహత్తర సేవ వెనుక ఉన్నది ఎవరు?

సమాజం పట్ల బాధ్యతతో, 'ఆరోగ్యవంతమైన ప్రజలే ఆరోగ్య భారత్‌కు పునాదులు' అనే బలమైన నమ్మకంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్'. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం కింద 'పిరమల్ స్వాస్థ్య' భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 32 ఆరోగ్య సేవా కేంద్రాలను స్టార్ హెల్త్ నిర్వహిస్తోంది.

ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్యం.. వాట్సాప్‌లోనే హెల్త్‌ కార్డ్
ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్యం.. వాట్సాప్‌లోనే హెల్త్‌ కార్డ్

వీటి ద్వారా ఇప్పటివరకు 1.83 లక్షల మందికి పైగా లబ్ధి పొందగా, మొత్తం 10 లక్షల మందికి చేరువ కావడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. మహబూబ్ నగర్ లోని లక్ష్మీ నగర్, వెంకటేశ్వర కాలనీలతో పాటు నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లలో కూడా స్టార్ హెల్త్ ఈ ఉచిత సేవా కేంద్రాలను విజయవంతంగా నడుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+